FLORAL TRIBUTES PAID AT TARIGONDA BRINDAVAN _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి

Tirumala, 25 May 2021:  On the occasion of the 291st Jayanti of Matrusri Tarigonda Vengamamba, TTD officials paid floral tributes at Vengamamba Brindavan in Tirumala on Tuesday.

The festivities of Jayanti utsava were held in Ekantam at Brindavan and after in the evening at Ranganayakula mantapam inside Srivari temple instead of Narayanagiri Gardens in view of Covid guidelines.

Sri Vengamamba, an ardent devotee of Narasimha Swamy and Venkateswara Swamy was born in 1730 at Tarigonda in Chittoor district and at attained Sajeeva Samadhi in 1817. She pioneered Anna Prasadam in Tirumala.

The practice of sankeetans of Annamacharya and Vengamamba are still continued in the Srivari temple even today.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి

తిరుమల, 2021, మే 25: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో మంగ‌ళ‌వారం ఉద‌యం టిటిడి అధికారులు పుష్పాంజలి సమర్పించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌యంతి ఉత్స‌వాల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో, తిరుమల వెంగ‌మాంబ బృందావ‌నంలో ఏకాంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంట‌ల నుండి ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారిని ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు. అనంత‌రం ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఏకాంతంగా వెంగ‌మాంబ జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817వ సంవ‌త్స‌రంలో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. శ్రీ‌వారికి ఏకాంత‌సేవ స‌మ‌యంలో అన్న‌మ‌య్య లాలి – వెంగమాంబ ముత్యాలహారతి నేటికీ కొనసాగుతున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.