FLORAL TRIBUTES PAID TO SRI ADIBHATLA NARAYANADASU _ శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 31 August 2025: Commemorating the 160th Jayanthi of Harikatha Pitamaha Srimad Ajjada Adibhatla Narayanadasu, a special programme was held at the premises of TTD-run Sri Venkateswara College of Music and Dance in Tirupati on Sunday.
The College Principal Dr. Uma Muddubala and DPP Secretary Sri Sriram Raghunath offered floral tributes to the statue of Sri Adibhatla Narayanadasu.
Following this, the students of the college rendered a community singing, while College students and faculty carried out a procession that culminated at Mahati Auditorium.
Later besides SVCMD faculty and students, the artists from HDPP took part in the event with great devotion and enthusiasm.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2025, ఆగష్టు 31: హరికథా పితామహునిగా పేరున్న అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి ఆదివారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఉమా.ముద్దుబాల, డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్ లు ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
అనంతరం కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు. శ్రీ ఎస్వీ మ్యూజిక్ కళాశాల నుండి ఊరేగింపుగా మహతి ఆడిటోరియం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు డిపిపి కళాకారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



