FLOWER DECORATIONS _ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా దాతల సహకారంతో శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది
Tirumala, 18 January 2025: During Vaikuntha Ekadashi Vaikuntha Dwara Darshan, it is a customary to decorate the Srivari temple with the help of donors.
On Saturday, a donor has placed some replica idols of deities near Addala Mandapam and decorated them.
Noticing this, the temple priests and religious staff suggested the donor that it is not proper to bring outside idols and decorate them within the premises of the temple complex.
As per their instructions, the outside idols by the donor were immediately taken out.
Donors are hereby advised by TTD not to bring outside idols and display them inside the temple premises except in the area as prescribed by TTD religious staff.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా దాతల సహకారంతో శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమల, జనవరి 18: అయితే శనివారం ఓ దాత అద్దాల మండపం సమీపంలో స్వామి, దేవేరుల నమూనా విగ్రహాలను ఉంచి అలంకరణ చేయడం జరిగింది.
ఇది గమనించిన అర్చక స్వాములు, ఆలయం లోపలి ప్రాంగణంలో నమూనా విగ్రహాలను తీసుకువచ్చి అలంకరణ చేయడం ఆలయ సంప్రదాయం కాదని సదరు దాతకు వివరించారు.
అర్చన స్వాములు సూచించిన సూచన మేరకు మిగిలిన పుష్పాలంకరణ లను పూర్తి చేసి సదరు దాత నమూనా విగ్రహాలను బయటకు తీసుకెళ్లడం జరిగింది.
అలాగే సదరు దాత బయట వారితో లోపల జరిగిన విషయాన్ని ఆవేశంతో చెప్పానని, ఆ విషయాన్ని అన్యదా భావించవద్దని ఆలయ అధికారులను కోరారు.
కేవలం టిటిడి సూచించిన ప్రాంతంలో మినహా బయట విగ్రహాలను తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోపల అలంకరణ చేయరాదని దాతలకు సూచించడమైనది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది