FOREST COVER, HUMAN-WILDLIFE CONFLICT MANAGEMENT IN TIRUMALA HELD _ తిరుమల అడవులలో వృక్ష సంపద పెరుగుదల, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యల పై సమీక్ష

Tirupati, 28 August 2025: TTD EO Sri J Syamala Rao on Thursday evening held a review meeting with the forest department of TTD on Forest Cover, Human-Wildlife Conflict Management in Tirumala.

The meeting was held in the chambers of EO in the TTD Administrative Building in Tirupati along with JEO Sri Veerabrahmam.

The TTD DFO Sri Phanikumar Naidu presented a detailed power point Presentation on the plantation program taken up in Tirumala in the last one year, replacement of Acacia auriculiformis Plantations in a phased manner, development of Medicinal & Herbal Gardens,sustainable forest restoration and many other activities.

The presentation also highlighted, 7,000 saplings of native species so far such as Thaandra, Raavi, Usiri, Velaga, Juvvi, Marri, Neredu, Athi, and Red Sanders have been planted in the last one year as against the target of 20 thousand saplings, besides several watershed and Soil Conservation Works, soil stabilization and many others.

As a part of wildlife management in Tirumala,  60 camera traps and 31 solar-powered active cameras deployed along both sides of the Alipiri–Tirumala footpaths, strategically positioned to monitor wildlife movements in high-traffic pilgrim areas.

The EO also suggested the officials concerned to come up with more advanced surveillance cameras and a comprehensive ecological sustainability plan for Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమల అడవులలో వృక్ష సంపద పెరుగుదలమానవ వన్య ప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై సమీక్ష

తిరుపతి, 2025 ఆగస్టు 28: తిరుమలలో అటవీ వృక్ష సంపద పెరుగుదలమానవులువన్య ప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై అటవీ శాఖ అధికారులతో టీటీడీ ఈవో శ్రీ జెశ్యామలారావు గురువారం సాయంత్రం  సమీక్షా సమావేశం నిర్వహించారు. 

తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో జరిగిన  సమావేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

 సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలుదశలవారీగా అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్షజాతుల పెంపకంఔషధ వనాల  అభివృద్ధిసుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలు వంటి అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20 వేల మొక్కల్లో భాగంగా ఇప్పటివరకు తాండ్రరావిఉసిరివెలగజువ్విమర్రినేరేడుఅత్తి మరియు ఎర్రచందనం వంటి స్థానిక జాతుల 7,000 మొక్కలు నాటినట్టు వివరించారుఅదనంగావాటర్‌షెడ్ మరియు మట్టిస్థిరీకరణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.

వన్యప్రాణుల నిర్వహణలో భాగంగాఅలిపిరితిరుమల  మార్గాల రెండు వైపులా 60 కెమెరా ట్రాపులు, 31 సౌర శక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారుభక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

ఈవో శ్రీ శ్యామలారావు అటవీ శాఖ అధికారులు మరింత ఆధునిక నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిరత ప్రణాళిక రూపొందించాలని  ఆదేశించారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేసినది