FORMER CJI OFFERS PRAYERS IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
TIRUPATI, 06 JANUARY 2023: The former CJI Sri NV Ramana offers prayers along with his family at Tiruchanoor temple on Friday evening.
He was welcomed by TTD Chairman Sri YV Subba Reddy.
The former CJI has darshan of Goddess Sri Padmavati Ammavaru followed by Vedaseervachanam at Aseervada Mandapam. He was presented with Sesha Vastram and Prasadams.
JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Shanti, VGO Sri Manohar and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి 6 జనవరి 2023: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో జస్టిస్ రమణ కు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు.
జిల్లా జడ్జి శ్రీ వీర్రాజు,ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, విజివో శ్రీ మనోహర్, ఆగమ సలహాదారుశ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.