FoSTaC AWARENESS HELD _ శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి•⁠ ⁠టీటీడీ ఈవో

Tirumala, 17 September 2024: Health safety and security of pilgrims is the top most priority of TTD and hence conducting awareness programs on Food Safety with the Food Safety Department to the hoteliers in Tirumala, said TTD EO Sri J Syamala Rao.

Addressing the awareness program organised jointly by TTD health wing, estates department with the Food Safety Department at Asthana Mandapam, the EO said, the health and hygiene of devotees thronging Tirumala holds the importance. All the eateries especially the Fast Food centers should follow Food Safety Laws or else action will be taken against the violators, he affirmed. The EO asked all the hoteliers to make use of this awareness programme.

Earlier the Food Safety Controller Sri Purnachandra Rao explained about proper hygienic and sanitary practices that restaurants and eateries in Tirumala should follow.

He also said with the initiative of TTD EO, the FoSTaC(Food Safety Training and Certification) programme is being organised for Tirumala hoteliers.

DyEO Health Smt Asha Jyothi, DyEO Estates Sri Venkateswarulu, Health Officer Dr Madhusudhana Prasad, VSO Sri Surendra, FoSTaC Trainer Sri Anjaneyulu, Tirumala Food Safety Officer Sri Jagadeesh, representatives of various eateries in Tirumala and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి

•⁠ ⁠హోటళ్ల నిర్వాహకుల అవగాహన కార్యక్రమంలో

•⁠ ⁠టీటీడీ ఈవో

తిరుమ‌ల‌, 2024 సెప్టెంబరు 17: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రత విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు తెలిపారు.

ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్స్ విభాగాలు ఆహార భద్రత విభాగం తో కలసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ, తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు. అన్ని తినుబండారాల దుకాణాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని, లేనిపక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు.

అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు మరియు తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుద్ధ్య పద్ధతుల, చట్టాలు గురించి వివరించారు.

టీటీడీ ఈవో చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫోస్టాక్ (ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీ వెంకటేశ్వరులు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన ప్రసాద్‌, విఎస్‌వో శ్రీ సురేంద్ర, ఫోస్టాక్‌ ట్రైనర్‌ శ్రీ ఆంజనేయులు, తిరుమల ఆహార భద్రత విభాగం అధికారి శ్రీ జగదీష్‌, తిరుమలలోని వివిధ హోటళ్ళ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.