FRAME UNIFORM LEASE TERMS FOR TTD KALYANA MANDAPAMS- TTD EO _ క‌ల్యాణ‌మండ‌పాల లీజుకు విధివిధానాలు రూపొందించాలి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 2 Jan. 21: The TTD EO Dr KS Jawahar Reddy on Saturday directed officials to frame uniform lease terms and regulations for all the 300 Kalyana Mandapams in the Telugu states and other regions in the country.

Addressing senior officials at his chambers in the TTD administrative buildings, the TTD EO instructed the TTD Estate officials to frame terms and conditions for leasing the TTD Kalyana Mandapams for weddings and other social events.

He asked them to prepare an action plan to categorise and fix lease tariffs to the TTD Kalyana Mandapams as per District, Municipal Corporation, Revenue Divisions, Talukas, Assembly and Mandal levels.

He said regulations should be framed for leasing out to Mutts, private parties, and philosophical institutions.

TTD JEO (Health and Education) Smt Sada Bhargavi, FA and CAO Sri O Balaji, CAO Sri Shesha Shailendra, SEs Sri Satyanarayana, Sri Jagadeswar Reddy and Estate officer Sri Mallikarjun were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌ల్యాణ‌మండ‌పాల లీజుకు విధివిధానాలు రూపొందించాలి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 02 జనవరి 2021: తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను లీజు ప్రాతిప‌దిక‌న కేటాయించేందుకు విధివిధానాలు రూపొందించాల‌ని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి పరిపాలనా భవనంలో గ‌ల కార్యాల‌యంలో శ‌నివారం అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ క‌ల్యాణ‌మండ‌పాల్లో టిటిడి నిబంధ‌న‌లకు అనుగుణంగా వివాహాలు ఇత‌ర శుభ‌కార్యాలు నిర్వ‌హించేందుకు లీజు ప‌ద్ధ‌తిపై కేటాయించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్టేట్ అధికారిని కోరారు. టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను జిల్లా, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, రెవెన్యూ డివిజ‌న్‌, తాలూకా(పాత), నియోజ‌క‌వ‌ర్గం, మండ‌ల కేంద్రంగా విభ‌జించి, అందుకు త‌గ్గ‌ట్టు లీజుకు ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌న్నారు. ఆధ్యాత్మిక సంస్థ‌లు, మ‌ఠాలు, ప్ర‌యివేటు వ్య‌క్తులు లీజుకు ద‌ర‌ఖాస్తు చేసుకునేలా నిబంధ‌న‌లు రూపొందించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, ఎస్ఇలు శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లికార్జున పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.