FROM UK TO SRIVARI SEVA… _ యూకే నుండి శ్రీవారి సేవకు భక్తురాలిని అభినందించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

TTD EO, ADDITIONAL EO CONGRATULATES NRI SEVAK

Tirumala, 02 February 2025: TTD EO Sri. J. Syamala Rao and Additional EO Sri. Ch. Venkaiah Chowdary on Sunday congratulated Ritu Vakkalanka, a woman who traveled across the continents to Tirumala for rendering Srivari Seva.

She met the EO and additional EO in a meeting held with the srivari sevaks at Asthana Mandapam on Sunday.

On this occasion, she said that the facilities being provided by TTD to the devotees are amazing like nowhere else in the world.

She said that she was working as a financial consultant in London and had come to Tirumala from UK to serve pilgrims as Srivari sevak.  

She expressed her happiness for the divine opportunity.

She said that distribution of Anna Prasadams by TTD to thousands of devotees in the Anna Prasadam Complex is not a normal thing and it is commendable that the TTD administration is arranging all the facilities for the devotees in a well-planned manner.

The EO and Additional EO also congratulated her and complimented her dedication to offer  voluntary service to the devotees travelling thousands of kilometers all the way from the UK to Tirumala to serve the common devotees through seva seva.

JEO Sri Veerabrahmam, CPRO Dr T Ravi were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

యూకే నుండి శ్రీవారి సేవకు భక్తురాలిని అభినందించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

తిరుమల, 2025 ఫిబ్రవరి 02: శ్రీవారి సేవ కోసం ఖండాంతరాలు దాటి తిరుమలకు విచ్చేసిన రీతూ వక్కలంక అనే మహిళను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం అభినందించారు.

ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈవో, అదనపు ఈవోలను కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.

తాను లండన్ లో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నానని, శ్రీవారి సేవ చేయడానికే యూకే నుండి తిరుమలకు వచ్చానని తెలిపారు. తనకు 30 రోజులు సేవ చేసుకునే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. అన్న ప్రసాద కేంద్రంలో వేలాదిమంది భక్తులకు టీటీడీ చేస్తున్న అన్న ప్రసాద వితరణ సాధారణ విషయం కాదని, టీటీడీ యంత్రాంగం పక్కా ప్రణాళికతో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు.

స్వామిపై భక్తిభావంతో యూకే నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి సేవ ద్వారా సామాన్య భక్తులకు విశేష సేవ చేయడం గొప్ప విషయమని ఆమెను ఈవో, అదనపు ఈవోలు అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.