GAJA GAMINI ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

TIRUPATI, 21 NOVEMBER 2025: The pleasant evening on Friday witnessed Sri Padmavati Ammavaru taking a majestic ride on Her favorite carrier Gaja Vahanam.

Led by caparisoned elephants, horses and bulls, the Goddess gently moved along the temple streets blessing devotees from 7pm onwards.

Earlier the Chandragiri legislator Sri Pulivarti Nani presented Pattu Vastrams as a traditional practice and offered prayers inside the temple.

Both the senior and junior pontiffs of Tirumala, EO Sri AK Singhal, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, DyEO Sri Harindranath were also present.

Among other dignitaries, the District Collector Dr Venkateswar, SP Sri Subbarayudu and others were present 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి, 2025 న‌వంబ‌రు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. 

వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎన్. సాంబశివరావు, శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, తిరుపతి కలెక్టర్ శ్రీ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు,  సివిఎస్వో శ్రీ కే.వి.ముర‌ళీకృష్ణ‌,  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ , ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.