GAJA LAKSHMI BLESSES ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీయానాదయ్య,శ్రీ నాగసత్యం, శ్రీ సుధీర్ కుమార్, శ్రీతిప్పేస్వామి, శ్రీ శేషుబాబు, శ్రీ ఆర్ వి దేశ్ పాండే, శ్రీ సుబ్బరాజు, శ్రీ ఉదయ బాను, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్,
ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati,14 November 2023: On the fifth day of the ongoing annual brahmotsavsms of Sri Padmavati temple in Tiruchanoor on Tuesday evening, the processional deity as Gaja Lakshmi in all Her resplendence blessed the devotees taking a royal majestic ride on the mighty Gaja Vahanam.
The divine elephant carrier procession was held in grandeur where in Ammavaru casted Her divine magical spell wearing the precious Srivari Lakshmi Kusula Haram brought from Tirumala matching the occasion.
Gaiety marked the grand procession along the mada streets to the rhythmic beat of drums and Mangala vaidyams as several cultural teams presented dances, kolatas and sankeertans in front of Vahanam.
Tirumala temple senior pontiff along with his deputy, Chairman Sri Karunakara Reddy, EO Sri Dharma Reddy, other board members JEOs Smt Sad Bhargavi, Sri Veerabrahmam, DyEO Sri Govindarajan many others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI