GAJA VAHANA _ గజ వాహనంపై సీతారాముల దర్శనం — భక్తికి పరమానందం
Vontimitta, 01 April 2026 : The Sixth day evening Sri Kodandarama Swamy took out a celestia on Gaja Vahanam as a part of ongoing annual Brahmotsavam on Wednesday.
After Sri Sitarama Kalyanam, Gajavahanam was held.
TTD officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై సీతారాముల దర్శనం — భక్తికి పరమానందం
ఒంటిమిట్ట / తిరుపతి, 2026 ఏప్రిల్ 01: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు.
సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
వాహనసేవలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




