GAJA VAHANA ALLURES _ గజ వాహనంపై శ్రీ సీతారాములు

VONTIMITTA/TIRUMALA, 11 APRIL 2025:The annual Brahmotsavam at Vontimitta witnessed Sri Sita Rama Lakshmana atop the majestic Gaja Vahanam on Friday night after the celestial Kalyanam.

On the sixth evening,  amidst grand paraphernalia, dance and bhajan troupes leading in front, the utsava deities glided majestically blessing devotees all along the mada streets encircling the temple.

Temple officials and a large number of devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీ సీతారాములు

ఒంటిమిట్ట / తిరుపతి 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

వాహన సేవలో టీటీడీ అధికారులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.