GAJA VAHANAM HELD _ గజ వాహనంపై శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి కటాక్షం

Tirupati /Chennai, 11 February 2026: The ongoing annual Brahmotsavam at Chennai Sri Padmavati temple witnessed Goddess blessing Her devotees on Gaja Vahanam.

 AEO Sri Dhanamjaya, superintendent Smt.Pushpalatha and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గజవాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కటాక్షం

అమ్మవారి దర్శనంతో భ‌క్తి త‌న్మ‌య‌త్వంతో చెన్నై భ‌క్తులు

చెన్నై / తిరుపతి, 2026 ఫిబ్రవరి 11: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుద‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది . గజం ఐశ్వర్యసూచకం. అందుకే “ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.