GAJAGAMANI RIDES ON GAJA VAHANAM_ గజవాహనంపై అమ్మవారు కనువిందు:
Tiruchanoor, 8 Dec. 18: On the colourful night of Saturday, Gaja vahana seva was performed wherein
Goddess Padmavati took out a celestial ride on her favourite vehicle, Gaia vahanam and blessed Her devotees.
As Garuda for Lord, Gaja plays a very important role in the festival of Ammavaru. Gaja is symbol of wealth, Pride and Majesty.
Gaja flag of Goddess Padmavati is considered a mascot of Shanti Nilayam
and a symbol of Goddesses supremacy, says temple priest, Sri Archakam Manikantha Bhattar.
The grandeur of brahmotsava vahana seva of Goddess of Riches was clearly seen with Gaja Vahanam.
TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజవాహనంపై అమ్మవారు కనువిందు:
తిరుపతి, 2018 డిసెంబరు 08: రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు తనకు ప్రీతిపాత్రమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి అమ్మవారు స్వర్ణ గజ వాహనంపై విహరిస్తుంది. గజపటాన్ని ఆరోహణం చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలమేలు మంగ వాహనసేవలలో గజవాహన సేవ ఘనమైంది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు అమ్మవారు ఐదవ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని ఆలయ అర్చకులు శ్రీ మణికంఠస్వామి తెలిపారు.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి , అదనపు సివి అండ్ ఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.