GANAPATI HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 02 NOVEMBER 2024: The month long Homa Mahotsavams commenced with Ganapati Homam in Sri Kapileswara Swamy temple on Saturday.
In the evening, Ganapati Puja, Punyahavachanam, Vastupuja, Paryagnikaranam, Mritsangrahanam, Ankurarpana, Kalasasthapana, Agnipratista, Ganapati Homam, Laghupurnahuti will be observed. The Ganapati Homam will continue on November 03 and 04 also.
Devotees shall pay Rs.500 per ticket on which two persons will be allowed on a day to participate in this Homa Mahotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2024 నవంబరు 02: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూదితో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతిపూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు. నవంబరు 3, 4వ తేదీలలో కూడా గణపతి హోమం జరుగనుంది.
నవంబరు 5వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :
నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. నవంబరు 7న సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
అదేవిధంగా నవంబరు 8న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం) నిర్వహించనున్నారు. నవంబరు 29న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు.
నవంబరు 30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్లు శ్రీ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలక్రిష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.