GANDHIAN PATH A ROLE MODEL TO WORLD – JEO _ గాంధీ మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి జెఈవో శ్రీ బసంత్ కుమార్
Tirupati, 2 Oct. 20: The non-violence path shown by Sri Mahatma Gandhi always remains as a role model across the globe for generations, said TTD JEO Sri P Basanth Kumar.
As part of 151st Gandhi Jayanti celebrations held at TTD Administrative building in Tirupati on Friday, the JEO garlanded the portrait of Mahatma Gandhi.
Sri Basant Kumar said Mahatma Gandhi not only achieved independence through the non-violent path but also infused national integrity among the people.
Observing the Path of truth, cleanliness and non-violence will be a fitting tribute to the Mahatma, he observed.
TTD JEO (Education and Health) Smt Sada Bhargavi, Chief Engineer Sri Ramesh Reddy, Welfare officer Sri Ananda Raju and other senior officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గాంధీ మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి జెఈవో శ్రీ బసంత్ కుమార్
తిరుపతి, 2020 అక్టోబరు 02: మహాత్మా గాంధీ అనుసరించి చూపిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శమని టిటిడి జెఈవో శ్రీ బసంత్ కుమార్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జెఈవో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ లక్ష్యం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గం కూడా అంతే ముఖ్యమని గాంధీజీ తెలియజేశారన్నారు. గాంధీజీ మార్గం నేటి యువతకు మార్గదర్శి అని చెప్పారు. అహింసామార్గం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్ముడు గాంధీ అన్నారు. దేశప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించి ఒక్కతాటిపై నడిపించారని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం, స్వచ్ఛత, అహింసలను ఆచరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో(విద్య, ఆరోగ్యం) శ్రీమతి ఎస్.భార్గవి, చీఫ్ ఇంజనీర్ శ్రీ రమేష్ రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఆనంద రాజు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.