GANDHIJI’S NON-VIOLENCE PATH IS AN IDEAL FOR THE WORLD: TTD WELFARE OFFICER _ అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి సంక్షేమ అధికారి శ్రీ ఆనందరాజు

Tirupati, 02 October 2025: The TTD Welfare Officer Sri Anandaraju said that the non-violence path practiced by the Mahatma Gandhiji is ideal for not only to the nation but the entire world. 

On the occasion of the 156th birth anniversary of the Father of the Nation Mahatma Gandhi, floral tributes were paid to the portrait of Gandhi at the conference hall of the TTD administration building on Thursday.

The speakers said that Gandhiji’s path is a guide for today’s youth. They recalled that he achieved independence through the path of non-violence. They urged humanity to practice the path of truth and non-violence inspired by the Father of the Nation Mahatma Gandhi.

Several officers and staff participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి సంక్షేమ అధికారి  శ్రీ ఆనందరాజు

తిరుపతి, 2025 అక్టోబర్ 02: జాతిపితి మహాత్మా గాంధీ ఆచరించిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శమని టిటిడి సంక్షేమ అధికారి శ్రీ ఆనందరాజు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా గురువారం టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

గాంధీజీ మార్గం నేటి యువతకు మార్గదర్శి అని వక్తలు చెప్పారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించారని గుర్తు చేసుకున్నారు.  జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం, అహింస మార్గాలను ఆచరించాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.