GANESH CHAVITI IN VINAYAKA TEMPLES ON BOTH GHAT ROADS _ తిరుమల ఘాట్ రోడ్లలో ఘనంగా వినాయక చవితి

Tirumala, 27 August 2025: Following Ganesh Chaviti on Wednesday, special Poojas were performed in the temples of Sri Vinayaka Swamy located on both the Ghat Roads.

The devotees offered prayers to Sri Vinayaka Swamy temple located on the Second road, on the way to Tirumala.

Prasadams were also distributed among the devotees on the auspicious occasion.

Similarly, TTD has made special decorations to the Ghat Road Vinayaka located on Down Ghat Road following Ganesh Chaviti and performed Poojas.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమల ఘాట్ రోడ్లలో ఘనంగా వినాయక చవితి

తిరుమల, 2025 ఆగస్టు 27: వినాయక చవితి సందర్భంగా బుధవారం తిరుమల మొదటి మరియు రెండో ఘాట్ రోడ్లలో ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.

అదేవిధంగా, తిరుమల నుండి తిరుపతి కి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయానికి గణేష్ చవితి సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.