GANGA AVATARA DANCE STEALS THE SHOW _ గ‌జ వాహ‌న‌సేవలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా గంగా అవ‌త‌ర‌ణ నృత్య రూప‌క ప్రదర్శన‌

Tirumala, 23 September 2023: On Saturday night, the sixth day of Srivari Salakatla Brahmotsavams, the performances of art groups organized under the auspices of TTD Hindu Dharmic Projects during the Gaja Vahana Seva brought more spiritual joy to the devotees. 

A total of 250 artists belonging to 10 groups from Andhra, Tamil Nadu, Pondicherry, Kerala, Orissa and Rajasthan performed adding enhanced grandeur to the vahana seva.

Ganga Avatarana dance performance by 25 artists of Sri Lalithambigai Troupe from Pondicherry dressed as Brahma, Lakshminarayana and Bhagiradha praying to Lord Shiva, Ganga stood as a special attraction.  

28 women team from Adoni entertained with kolatam and another 25 member young women from the state of Kerala dressed in traditional Kerala attire, danced Karakatakam.        

Artists from Rajasthan performed the Gangaur dance wearing the guises of village deities of the rural areas of Rajasthan.  Odissi dance by 25 artists from Orissa attracted the devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గ‌జ వాహ‌న‌సేవలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా గంగా అవ‌త‌ర‌ణ నృత్య రూప‌క ప్రదర్శన‌

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 23: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఆర‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి గ‌జ‌ వాహ‌నసేవ‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు మ‌రింత ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర‌, త‌మిళ‌నాడు, పాండిచ్చేరి, కేర‌ళ‌, ఒరిస్సా, రాజ‌స్థాన్ రాష్ట్రాలకు చెందిన 10 క‌ళాబృందాలలో 250 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

పాండిచ్చేరికి చెందిన శ్రీ ల‌లితాంబిగై ట్రూప్‌లోని 25 మంది క‌ళాకారులు బ్ర‌హ్మ‌, ల‌క్ష్మీనారాయ‌ణులు, ప‌ర‌మ‌శివుడిని ప్రార్ధిస్తున్న భ‌గీర‌ధుడి వేష దార‌ణ‌లు ధ‌రించి గంగా అవ‌త‌ర‌ణ నృత్య రూప‌క ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుగుణంగా పంబ‌లు వాయిస్తూ క‌ళాకారులు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆధోనికి చెందిన 28 మంది మ‌హిళ‌లు కోలాటం డ్ర‌మ్స్‌, ప‌లుర‌కాల వాయిద్యాల‌తో భ‌జ‌న భ‌క్తుల‌ను అల‌రించాయి. కేర‌ళ రాష్ట్రంకు చెందిన 25 మంది యువ‌తులు కేర‌ళ సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ ధ‌రించి క‌ర‌కాట‌కం నాట్యం, మ‌రో 25 మంది మ‌యూర నృత్యం చేస్తూ భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షించారు.

తమిళనాడు రాష్ట్రం శ్రీ‌రంగంకు చెందిన 25 మంది 6 నుండి 8 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు గ‌ల పిల్ల‌లు శ్రీనివాస క‌ల్యాణం ప్ర‌ద‌ర్శించారు. రాజ‌స్థాన్‌కు చెందిన 25 మంది క‌ళాకారులు రాజ‌స్థాన్ గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ దేవ‌తాల‌ను త‌ల‌పై ధ‌రించి గంగౌర్ నృత్యం ప్ర‌ద‌ర్శించారు. ఒరిస్సాకు చెందిన 25 మంది క‌ళాకారుల ఒడిస్సీ నృత్యం భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.