‌GARUDA GAMANA GARUDADHWAJA-MALAYAPPA GLIDES ON GARUDA _ వైభ‌వంగా శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌

వైభ‌వంగా శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌

తిరుమల, 2024 అక్టోబ‌రు 08: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ జె శ్యామలరావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీ‌మ‌తి గౌత‌మి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ శ్రీ‌ధ‌ర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.

LAKHS WITNESS GARUDA VAHANA SEVA

TIRUMALA, 08 OCTOBER 2024: Lakhs witnessed Garuda Seva of Sri Malayappa Swamy on Tuesday amidst spiritual fervour knowing no bounds chanting “Govinda….Govinda” which echoed everywhere in Tirumala. 

Garuda Vahana Seva is a significant religious event in all the carrier processions of Srivaru that symbolizes the eternal bond between the deity and His devotees. 

Symbol of Devotion

Garuda is a divine eagle that embodies unwavering devotion and Servitude. Garuda is often depicted as a large and majestic eagle, symbolizing unparalleled speed and strength.

Legends say that Garuda, the King of Aves and favourite charioteer of Sri Mahavishnu(Sri Venkateswara) considered the most respected and most sought-after follower of His Master. The darshan of Srivaru on Garuda vahanam is strongly believed to be very auspicious, which fulfils the desires of all His devotees.

HH Sri Pedda Jeeyangar, HH Sri Chinna Jeeyangar, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and other officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI