GARUDA PANCHAMI GARUDA SEVA HELD _ గరుడ పంచమి సందర్భంగా వైభవంగా గరుడ సేవ

TIRUMALA, 21 AUGUST 2023: On the auspicious occasion of Garuda Panchami, Sri Malayappa took out a celestial ride all along the four mada streets to bless His devotees on the mighty Garuda Vahanam on Monday evening.

 

CVSO Sri Narasimha Kishore, SE2 Sri Jagadeeshwar Reddy, DyEOs Sri Harindranath, Sri Rajendra and others were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ పంచమి సందర్భంగా వైభవంగా గరుడ సేవ
 
తిరుమల, 2023 ఆగస్టు 21: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.   
 
శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు ఈ సందర్భంగా  ”గరుడ పంచమి” పూజ చేస్తారు. 
 
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ రాజేంద్ర, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.