GARUDA SEVA AT SRINIVASA MANGAPURAM DRAWS HUGE CROWD _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

KALYANA VENKATESA GLIDES ON VAINATEYA

GOVINDA… GOVINDA ECHO CHANTS EVERYWHERE

Tirupati, 22 February 2025: On a pleasant evening on Saturday, Sri Kalyana Venkateswara took out a majestic celestial ride on the mighty Garuda Vahanam.

As soon as the curtains opened at Vahana Mandapam at 7pm, the devotees chanted Govinda.. Govinda with religious ecstasy with which the entire premises echoed and reverberated with devotional vibes.

The processional deity of Sri Kalyana Venkateswara in all His religious splendour moved swiftly along four mada streets sitting atop the King of Aves and blessed the multitude of devotees.

Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, Special Officer and CPRO Dr T Ravi, spl. Gr. DyEO Smt Varalakshmi and others beside local legislator Sri Pulivarti Nani were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 22: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శ‌నివారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.

స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

వాహ‌న‌సేవ‌లో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి దంప‌తులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని దంపతులు, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.