GARUDA SEVA HELD _ తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ
TIRUMALA, 12 AUGUST 2022: Garuda Seva was held with religious fervour on the auspicious occasion of Sravana Pournami in Tirumala on Friday night.
Sri Malayappa in all His splendour took out a celestial ride on mighty Garuda Vahanam and blessed His devotees along the mada streets.
HH Tirumala Sri Chinna Jeeyar Swamy, EO Sri AV Dharma Reddy, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2022 ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.