GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
TIRUMALA, 22 JUNE 2024: The monthly Pournami Garuda Seva was observed in Tirumala on Friday evening between 7pm and 9pm.
Sri Malayappa in all His religious splendour blessed His devotees who converged to catch the divine glimpse of Srivaru on the mighty Garuda Vahanam all along the galleries of the four mada streets surrounding the hill shrine.
Both the senior and junior pontiffs of Tirumala, Temple DyEO Sri Lokanatham and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2024 జూన్ 22: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.