GARUDA SEVA OBSERVED _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ
TIRUPATI, 03 JULY 2023: On the auspicious Ashada Guru Pournami day on Monday, Garuda Seva was observed in the temple of Sri Govindaraja Swamy in Tirupati.
The processional deity of Sri Govindaraja Swamy took out a grand celestial ride all along the mada streets to bless His devotees.
DyEO Smt Shanti and other officials, and devotees participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి, 2023, జూలై 03 ;పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా జరిగింది.
ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.