GARUDA VAHANA OBSERVED _ గ‌రుడ వాహనంపై సకలలోక రక్షకుడు

Tirumala, 8 February 2022: The third one among the sequence of Saptha Vahanas, Garuda Vahana was observed.

 

According to legend, Garuda Vahanam is considered divine in all Sri Vaishnava Divya Desams. The Acharyas hail Garuda as a Vedic personality and his wings are regarded as symbolic of Vedic glory. The blessings of Sri Malayappa on Garuda Vahana is a divine antidote against all sins.

 

TTD EO Dr KS Jawahar Reddy, Board members Sri Ramabhupal Reddy, Sri Madhusudhan Yadav, Sri Maruti Prasad, Sri Ramulu, Additional EO Sri AV Dharma Reddy, New Delhi LAC President Smt V Prasanthi Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPAT

గ‌రుడ వాహనంపై సకలలోక రక్షకుడు

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో సకలలోక రక్షకుడైన శ్రీనివాసుడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గ‌రుడ వాహనంపై అనుగ్రహించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్, శ్రీ రాములు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.