GARUDA VAHANA REMINDS OF BRAHMOTSAVA GARUDA SEVA _ గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం

SEA OF HUMANITY

TIRUMALA, 28 JANUARY 2023:  Every gallery has been occupied with pilgrims who thronged to witness Sri Malayappa on Garuda Vahanam.

Being the third one in the series of Sapta Vahana Sevas, Sri Malayappa blessed His devotees on the mighty Garuda Vahanam as a part of Radhasaptami vahana sevas on Saturday.

The vahana seva held between 11am and 12noon.

Devotees were delighted to catch the glimpse of Sri Malayappa of the most auspicious Garuda Vahanam. Many of them were seen offering Harati in galleries while some capturing photos of Sri Malayappa on Garuda Vahanam in their mobiles.

Board members Sri Ramulu, Sri Madhusudhan Yadav, Sri Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were also present.                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గరుడవాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం

తిరుమల, 28 జనవరి 2023: తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం (ఉదయం 11 నుండి 12 గం||ల వరకు) :

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు ఇత‌ర టిటిడి అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.