GARUDA VAHANA SEVA AT APPALAYAGUNTA _ గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసం
TIRUPATI, 21 JUNE 2024: Garuda Vahana Seva was observed with utmost religious fervour in Appalayagunta on Friday evening.
Sri Prasanna Venkateswara Swamy was taken for a majestic ride on the mighty Ave carrier.
Wearing all precious silks and jewels, the deity blessed his devotees along the streets encircling the shrine.
JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy, Kankanabhattar Sri Suryanarayanacharyulu, Superintendent Smt Srivani and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రాజసం
తిరుపతి, 2024 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.
బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.
వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ఓ శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.