GARUDA VAHANA SEVA HELD AT SKVST & SRI GT _ గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం

TIRUPATI, 03 JANUARY 2026: The monthly Pournami Garuda Vahana Seva was observed with grandeur in Sri Govindaraja Swamy temple on Saturday evening.

The processional deity of Sri Govindaraja Swamy mounted on Garuda Vahanam paraded along the temple streets to bless the devotees.

Temple officials, Archakas and devotees participated.

GARUDA VAHANA SEVA HELD AT SKVST

The monthly Pournami Garuda Vahana Seva was observed with grandeur in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Saturday evening.

The processional deity of Sri Kalyana Venkateswara atop the mighty Garuda Vahanam paraded along the temple streets to bless the devotees.

The temple officials, Archakas and devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కటాక్షం    

తిరుపతి, 2026 జనవరి 03: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన గోవిందుడు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో…..

శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది.

గ‌రుడ వాహ‌నంస‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తున్నారు . జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తారు.

వాహ‌న‌సేవ‌లో ఆల‌య అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.