GARUDA VAHANAM HELD AT JUBILEE HILLS SV TEMPLE _ గరుడ వాహనంపై భక్తులను ఆశీర్వదించిన శ్రీవేంకటేశ్వరుడు
Tirupati, 21 February 2026: As part of the ongoing annual Brahmotsavams at Sri Venkateswara Swamy Temple, Jubilee Hills, Hyderabad, Sri Venkateswara blessed devotees by taking a grand procession on Garuda Vahanam on Saturday evening at 7 PM.
Devotional troupes performed bhajans and kolatams, while traditional mangala Vaidyams that added grandeur to the procession.
Earlier in the morning, the Sri Venkateswara gave darshan in Mohini Avataram, followed by Snapana Tirumanjanam and Unjal Seva in the evening.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
- oplus_11534368
- oplus_9445376
- oplus_145753120
గరుడ వాహనంపై భక్తులను ఆశీర్వదించిన శ్రీవేంకటేశ్వరుడు
తిరుపతి, 2026, ఫిబ్రవరి 21: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై రాత్రి 7 గంటలకు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
కాగా శనివారం ఉదయం 8 గం.లకు మోహిని అవతారంలో భక్తులను కటాక్షించారు. అనంతరం ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి గరుడ వాహన సేవ అశేష భక్తుల మధ్య సాగింది.
ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 8 గం.లకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 3 గం.లకు రథ రంగ ఢోలోత్సవం, రాత్రి 7 గం.లకు గజ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.
వాహనసేవలో ఎల్ ఏసి ప్రెసిడెంట్ శ్రీ ఏ.వి.రెడ్డి, అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్, శ్రీ హరికృష్ణ, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే దారి చేయబడింది.






