GLOBAL RECOGNITION FOR SRI RAMANUJACHARYA’S WORKS: DR CHAKRAVARTHI RANGANATHAN _ విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద : డా. చక్రవర్తి రంగనాథన్

AVATAR MAHOTSAVAMS CONCLUDE

Tirupati, April 22, 2026: The literary works of Sri Ramanujacharya have gained global recognition for their spiritual and philosophical depth, said Dr. Chakravarthi Ranganathan.

The three-day Avatar Mahotsavams, organized by TTD at Annamacharya Kalamandiram in Tirupati, concluded on Wednesday.

He stated that Sri Ramanujacharya made the path of devotion simple and accessible to all, and his teachings continue to spread widely.

Annamacharya Project artists led by Smt. Rajyalakshmi presented devotional songs.

Coordinator Sri Purushottam and devotees attended the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద : డా. చక్రవర్తి రంగనాథన్

ఘనంగా ముగిసిన అవతార మహోత్సవాలు

తిరుపతి, 2026 ఏప్రిల్ 22: శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ తెలిపారు.

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.

ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు దేశవ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.

అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రాజ్యలక్ష్మీ బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది