GLORIOUS UTLOTSAVAM IN TIRUCHANOOR _ తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం
Tirupati, 17 August 2025: A grand Utlotsavam was held on Sunday evening at the Sri Krishna Swamy Temple, which is affiliated to the Sri Padmavati Ammavari Temple in Tiruchanoor, on the next day of Gokulashtami.
The temple officials, temple priests and a large number of devotees participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం
తిరుపతి, 2025 ఆగస్టు 17: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఆదివారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది.
ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6.15 గంటల నుండి శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయఅధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




