GODA MALAS TO SRIVARU _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు
TIRUMALA, 15 JANUARY 2025: Following the auspicious Goda Parinayam, the Andal Goda Malas brought from Sri Govindaraja Swamy temple reached Pedda Jeeyar mutt and from there proceeded to Srivari temple in a procession on Wednesday.
Later, after performing a special the same is decorated to the presiding deity.
HH Sri Pedda Jeeyar and HH Sri Chinna Jeeyar Swamijis of Tirumala, Temple officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
తిరుమల, 2025 జనవరి 15: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు బుధవారం ఉదయం అలంకరించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్‌స్వామివారి మఠానికి బుధవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.