GODA PARINAYAM ENTHRALLS _ కన్నుల పండువగా గోదా కల్యాణం

TIRUPATI, 15 JANUARY 2025: TTD performed Goda Parinayam in the Parade Grounds behind the TTD Administrative building in Tirupati on Wednesday evening.
 
GODA AND SRI KRISHNA SWAMY KALYANAM
 
Earlier, the deities of Andal Sri Goda Drvi and Sri Krishna Swamy, finely decked in dazzling jewels and bright silks were brought and seated on a special platform on the stage of Parade Grounds.
 
SERIES OF EVENTS IN KALYANAM
 
Archakas performed Kalyanam in a colourful manner by chanting Vedic hymns. 
 
The marriage was observed with utmost devotion and grandeur with a series of events including Punyahavachanam, Vishwaksena Aradhana, Ankurarpanam, Kankanadharana, Pratisarabandhana Puja, Sankalpam,   Kanyadana Mahotsavam, Mangalya Dharanam, Varanamayiram, Naivedyam and Mangala Harati performed. 
 
ANNAMACHARYA SANKEERTANS AND DANCE BALLET ENTHRALLS
 
The spiritual fervour of the programme enhanced with the rendition of Annamacharya Sankeertans and the Goda Parinayam dance ballet performed by the students of SV College of Music and Dance of TTD.
 
The denizens who thronged the celestial marriage event were overwhelmed to witness the Goda Kalyanam that was observed in a grand manner.
 
TTD Trust Board member Sri Bhanuprakash Reddy, JEO Sri Veerabrahmam, Tirumala temple DyEO Sri Lokanatham, SVMD Principal Dr Uma Muddubala and others were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

కన్నుల పండువగా గోదా కల్యాణం

తిరుపతి, 2025 జ‌న‌వ‌రి 15: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది.

ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతంగా అలరించింది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.

టిటిడి బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఎస్వీ సంగీతనృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దు బాల తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.