GODDESS GRACES AS YOGA LAKSHMI _ సింహ వాహనంపై యోగలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి
Tiruchanoor, 25 Nov. 19: On the third day evening of the ongoing annual brahmotsavams of Goddess Sri Padmavathi Devi at Tiruchanoor, the deity graced on Simha Vahanam as Yoga Lakshmi.
Akin to Tirumala Brahmotsavams, where Lord Malayappa shines as Yoga Narasimha, Goddess also following the path of Her beloved, donned Yoga Lakshmi Avatara with her hands folded in Yogamudra.
The Divya Prabandha Parayana Gosti by Jiyangar Swami disciples, varied arts by various artistes in front of vahana seva enhanced the glory of Goddess Sri Padmavathi Devi.
HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, VGO Sri Prabhakar, Agama Advisor Sri Srinivasa Charyulu, Arjitham Inspector Sri Srinivasulu and others took part.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సింహ వాహనంపై యోగలక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి
తిరుపతి, 2019 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి యోగలక్ష్మి అలంకారంలో అమ్మవారు యోగ ముద్రలో భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
వాహనసేవలో కళాకారుల భరతనాట్యం, ఇతర భక్తి సంకీర్తనలకు నృత్య ప్రదర్శన, చిన్నపిల్లల దేవతామూర్తుల వేషధారణ, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ అనంత, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్లు శ్రీ గోపాలకృష్ణారెడ్డి, శ్రీ ఈశ్వరయ్య, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.