GODDESS PADMAVATHI MESMERISES AS CELESTIAL BEAUTY IN MOHINI AVATARAM _ ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

“ADDAMULO CHOOCHUKOVE ALAMELMANGA…ITTI GUNAVANTURALU EE ALAMELMANGA”

TIRUPATI, 24 NOVEMBER 2022:  The glory and beauty of the Goddess who sits on riches and bestows prosperity on humanity, Sri Padmavathi Devi enhanced on Thursday morning as She blessed Her devotees in the Celestial Beauty-Mohini Avatara.

As a part of the ongoing Navahnika Karthika Brahmotsavam in Tiruchanoor, the Goddess Sri Padmavathi Devi appeared in all Her religious splendour, wearing colourful Pattu Vastrams, dazzling jewels appeared before the devotees with Her mesmerising charm all along the four mada streets.

The different versatalities of Goddess has been depicted all these days on various carriers where She showcased Her prowess as Lakshmi(Riches), Keerthi(Fame), Daya(Compassion) and now as Maya(Myth) in Mohini Avatara. 

The beauty of the Goddess reflected on the mirror which was kept opposite to Her on the palanquin carrier in Mohini Avatara. The live telecast by SVBC helped the devotees across the globe to witness the matchless elegance, royalty, beauty and grandeur of Goddess Padmavathi Devi in Mohini Avatara.

The performance by various artistes from different states in front of vahana seva added the colour and enhanced the festive fervour.

HH Sri Sri Sri Satagopa Ramanuja Pedda Jeeyar Swamy and HH Sri Sri Sri Govinda Ramanuja Chinna Jeeyar Swamy, the senior and junior pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, EE Sri Narasimha Murthy, Deputy EO Sri Lokanatham, DFO Sri Srinivas, Additional Health Officer Dr Sunil, VGO Sri Manohar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుపతి, 2022 నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం శ్రీ అల‌మేలుమంగ అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పల్లకీలో మోహిని అలంకారం

అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.

ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

గ‌జ వాహ‌నం

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, విఎస్వో శ్రీ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ శేషగిరి, ఆర్జిత ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.