GODDESS RIDES ON GARUDA VAHANAM _ గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

Tirupati, 22 February 2025:    As part of the ongoing Sri Padmavati Ammavari Brahmotsavam in Chennai, the devotees on Saturday evening witnessed the universal mother on Garuda Vahanam.

As per sacred texts the two wings of Garuda are the symbols of knowledge and wisdom.  Lord and Goddess are served by Garudalwar.  Puranas say that Srivaru, who wears Garuda Pachcha as an ornament on His chest, bestows true happiness along with Sri Padmavati Devi.  

Temple AEO Shri Parthasaradhi, Superintendent smt Pushpalatha, temple priests and other officials participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు.

గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు, అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.