GOKULASTAMI ASTHANAM ON AUGUST 16 UTLOTSAVAM ON AUGUST 17 _ తిరుమలలో ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, 17న ఉట్లోత్సవం
Tirumala, 11 August 2025: The auspicious Gokulastami Asthanam will be observed on August 16 while Utlotsavam on August 17 in Tirumala.
The Asthanam will take place from 8 pm to 10 pm at Bangaru Vakili on Saturday and for the Utsava deities of Sridevi, Bhudevi, Sri Krishna Swamy, Ekanta Tirumanjanam will be observed. Later Dwadasaradhanam follows.
On August 17, Utlotsavam will be performed from 4 pm onwards at different places in Tirumala.
The processional deities of Sri Malayappa and Sri Krishna Swamy on different Tiruchis take part in this traditional fete and bless devotees.
In connection with these festivals, TTD has cancelled a few Arjita sevas.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, 17న ఉట్లోత్సవం
తిరుమల, 2025 ఆగస్టు 11: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోగోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపుచేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.
ఆగస్టు 17న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
