GOKULASTAMI CELEBRATIONS AT KT _ ఆగస్టు 30న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

TIRUPATI, 24 AUGUST 2021: Special Puja will be performed in Sri Venugopala Swamy temple located inside Sri Kapilatheertham on the occasion of Sri Krishna Janmastami on August 30.

In view of Covid this fete will be observed in Ekantam. As part of it Abhishekam will be performed to the Mulamurty in the morning followed by Sarva Darsanam while Asthanam will be performed in the evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 30న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2021 ఆగస్టు 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీ గోకులాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ ఉత్స‌వాన్ని ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.