GOKULASTAMI HELD AT KARVETINAGARAM _ కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి

Tirupati, 26 August 2024: As part of Sri Krishna Janmashtami festival, Asthanam was performed in a grand manner to Sri Rukmini Satyabhama sameta Sri Venugopala Swamy at Karvetinagaram on Monday.

AEO Sri Parthasaradhi, Superintendent Sri Somasekhar, devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి

తిరుపతి, 2024 ఆగస్టు 26: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమల, కొలువు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం సాయంత్రం 5.30 గంటలకు గోకులాష్టమి ఆస్థానం, పురాణం పఠనం జరిగింది.

ఈ సందర్భంగా రాజమహల్ కు చెందిన రాజవంశీకులు శ్రీకృష్ణ ప్రియ బృందం నృత్య నివేదన సమర్పించారు. రాజవంశీకులు గత 58 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన స్వామివారి ముందు నృత్యం ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

కాగా ఆగష్టు 27న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని సాయంత్రం 5 గంటలకు గోపూజ, ఉట్లోత్స‌వం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూప‌రింటెండెంట్ శ్రీ సోమశేఖర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్ కుమార్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.