GOLD CHAIN HANDED OVER _ భక్తుడికి బంగారు గొలుసు అప్పగింత
TIRUMALA, 08 FEBRUARY 2026: In a swift action, the TTD cops handed over the lost chain to its owner on Sunday.
As per the available details, a devotee named Sri D. Koteswara Rao came for a darshan with his family. While they were proceeding for darshan through the Vaikuntham Queue Complex, his wife gold chain fell off.
Based on his complaint, and following orders from the CVSO Sri Muralikrishna and in the supervision of the V&SOs Sri Ram Kumar and Sri Surendra, the AVSO Sri Chiranjeevi and his team verified the CCTV footage and returned the chain worth around six lakh to the devotee.
The CVSO praised the vigilance staff for their promptness and quick response.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తుడికి బంగారు గొలుసు అప్పగింత
• త్వరితగతిన స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ప్రశoసించిన cv&so
తిరుమల, 2026 ఫిబ్రవరి 08: తిరుమలలో ఓ భక్తుడి వద్ద తప్పిపోయిన బంగారు గొలుసును సంబంధిత భక్తునికి ఆదివారం తిరిగి అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…
శ్రీ డి. కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తుండగా, ఆయన భార్య ధరించిన బంగారు గొలుసు జారి పడి పోయింది.
ఈ విషయమై సదరు భక్తుడు అందించిన ఫిర్యాదు మేరకు, సీవీఎస్‌ఓ శ్రీ మురళీకృష్ణ ఆదేశాలతో, విఎస్‌ఓలు శ్రీ రాం కుమార్, శ్రీ సురేంద్ర ల పర్యవేక్షణలో, ఏవీఎస్‌ఓ శ్రీ చిరంజీవి మరియు ఆయన బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి భక్తునికి తిరిగి అప్పగించారు.
ఈ సందర్భంగా సీవీఎస్‌ఓ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతను, త్వరిత స్పందనను ప్రశంసించారు.

