GOLD TULASI MALA DONATED _ శ్రీ కోదండరామస్వామివారికి బంగారు తులసి హారం బహుకరణ

Tirupati, August 2, 2025: A devotee from Bengaluru has donated a golden Tulasi mala to Sri Kodandarama Swamy Temple in Tirupati on Saturday.

The Mala, weighing around 257 grams and valued at ₹26 lakhs, is engraved with Gayatri Bijaaksharas on each Tulasi leaf. 

The donor handed over the ornament to the temple Deputy Executive Officer, Smt. Nagaratna.

Temple Chief Priest Sri Anand Kumar Deekshitulu, Temple Inspector Sri Suresh, and other officials participated in the event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారికి బంగారు తులసి హారం బహుకరణ 

తిరుపతి, 2025 ఆగస్టు 02: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. 

రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందించారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.