‘GOPUJA MAHOTSAVAM’ AT SV GOSALA ON JAN 16 _ జనవరి 16న ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’

Tirupati, 14 January 2026: The Gopuja Mahotsavam will be observed in a grand manner on January 16, on the occasion of Kanuma festival, at the TTD-run Sri Venkateswara Gosamrakshanasala (SV Gosala) in Tirupati.

On this occasion, a series of events including Abhishekam, puja and harati to Sri Venugopala Swamy, followed by Gopuja and Gaja pujas will be conducted.

Later, from 11.15 a.m., devotional programmes including bhajans and kolatams by Dasa Sahitya Project artistes, and sankeertanas by Annamacharya Project artistes will be held.

On the day of Gopuja Mahotsavam, TTD is providing an opportunity for its devotees to personally feed the cows with jaggery, rice and fodder. 

The Dldevotees are requested to make use of this auspicious opportunity and seek the divine blessings of Gomata and Srivaru.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 16 ఎస్వీ గోశాలలోగోపూజ మహోత్సవం

తిరుప‌తి, 2026 జ‌న‌వ‌రి 14: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 5 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, పూజ, హారతి కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10.30 గం.ల నుండి 11.15 గం.ల వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరుగనుంది. తదుపరి 11.15 గం.లకు  దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.