GOVARDHANAGIRIDHARA ARRULES ON PUSHPAKA VIMANAM _ పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

TIRUMALA, 20 OCTOBER 2023: The unique and exclusive vahana seva during the ongoing Navaratri Brahmotsavams, the Pushpaka Vimanam was observed with religious fervour on Friday evening.

The finely decked Pushpaka Vimanam glided along the four mada streets carrying Sri Malayappa Swamy in Govardhanagiridhara Alankara flanked by Sridevi and Bhudevi on His either sides.

Pushpaka Vimanam seva will be observed only during Navaratri Brahmotsavams.

Devotees were allured by the beauty of the divine plane and charm of the deities.

TTD Chairman Sri Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమల, 2023 అక్టోబరు 20: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌లకు గోవర్ధనగిరిధారి అయిన రుక్మిణి స‌త్య‌భామ స‌మేత శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు ‌పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చారు.

పుష్ప‌క విమానం సేవ‌ను మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు.

ఈ ప్రత్యేకమైన పుష్ప‌క విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 27 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడ‌వు, 14 అడుగుల వెడల్పుతో దాదాపు ఒక ట‌న్ను బ‌రువు ఉంటుంది. ఇందులో 6 రకాల సాంప్రదాయ పుష్పాలు ఉప‌యోగించారు. శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుత్మంతుడు, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ప్ర‌భావ‌ళితో కూడిన అష్ట‌నాగులు, మూడ‌వ ద‌శ‌లో తిరునామాలు, గోపురంతో రూపొందించారు.

తమిళనాడులోని సేలానికి చెందిన 20 మంది, టీటీడీ గార్డెన్ విభాగానికి చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమానాన్ని సిద్ధం చేశార‌ని టీటీడీ గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ భ‌ట్‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహ‌కారాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.