GOVINDA RAJA GRACES ON TIRUCHI _ శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి దర్శనం

TIRUPATI, 15 FEBRUARY 2022: On the fifth day as part of ongoing annual Teppotsavams in Sri Govinda Raja Swamy temple in Tirupati, Sri Govinda Raja Swamy with His two consorts Sridevi and Bhudevi graced on Tiruchi.

As the annual float festival is taking place in Ekantam owing to Covid restrictions, Tiruchi fete was observed.

Spl Gr DyEO Sri Rajendrudu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి దర్శనం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 15: శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్లు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు.

కాగా చివ‌రి రోజు కూడా శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. బుధ‌వారంతో తెప్పోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఈ కార్య‌క్రమంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటి ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ నారాయ‌ణ‌, శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.