GOVINDARAJA CHILLS ON CHANDRA PRABHA VAHANA _ చంద్ర‌ప్రభ వాహనంపై గోవిందరాజస్వామి వైభ‌వం

Tirupati, 24 May 2021: On the Seventh day of the ongoing annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple, the processional deity chilled on Chandra Prabha vahanam.

Due to Covid guidelines, the Vahana Seva was observed in Ekantam on Monday evening.

Legends says that Chandra-the moon stands for promoting medicinal values among living beings including plants.

As per the scripts in the “Purushottam Praptiyagam” Chandra is described as Sri Maha Vishnu who as an invisible architect evolved solutions for all ills in the society.

The Chandra Prabha Vahanam signifies the role of the school of herbal and ayurvedic medicine“.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Kankana Bhattar Sri AT Parthasarathy Dikshitulu, Staff others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్ర‌ప్రభ వాహనంపై గోవిందరాజస్వామి వైభ‌వం

తిరుపతి, 2021 మే 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం సాయంత్రం గోవిందరాజస్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఎ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.