GOVINDARAJA RIDES ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం
TIRUPATI, 07 JUNE 2025: The Saturday evening witnessed Gaja Vahana Seva, as a part of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati.
The Utsava deity of Sri Govindaraja Swamy, sitting in all His regality on the mammoth Gaja Vahanam, marched majestically along the temple streets to bless His devotees.
COLOURFUL CULTURAL FEAST
The grandeur of the procession had enhanced with the royal paraphernalia coupled with the performances by the colourful devotional cultural teams.
Both the Tirumala Pontiffs, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అభయం
తిరుపతి, 2025 జూన్ 07: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి , పలువురు అధికారులు , శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.