GOVINDARAJA SHINES ON SURYAPRABHA VAHANA _ సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం
Tirupati, 24 May 2021: On the seventh day morning on Monday, as part of the ongoing annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple, the processional deity of Swamy decked blessed His devotees on Suryaprabha vahanam held in Ekantam due to Covid guidelines.
Later Snapana Tirumanjanam was performed to the deities between 9:30am and 10:30am.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం
తిరుపతి, 2021 మే 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే వృక్షలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించిన స్వామిని దర్శించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ శ్రీ ఎ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వేంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.