GOVINDARAJA SWAMY TAKES RIDE ON TEPPA _ తెప్ప‌పై శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారి అభ‌యం

Tirupati, 21 Feb. 21: On the second day of the ongoing annual teppotsavams in Sri Govindaraja Swamy pushkarani, Lord as Parthasaradhi flanked by Rukmimi and Satyabhama on either sides, blessed His devotees on the finely decked float.

Spl. Gr. DyEO Sri Rajendrudu, VGO Sri Manahor and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తెప్ప‌పై శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారి అభ‌యం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ‌ రోజైన ఆదివారం సాయంత్రం రుక్మీణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థ‌సార‌ధిస్వామివారు తెప్పపై విహరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు, అమ్మవార్ల‌తో కలిసి ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

అదేవిధంగా సోమ‌వారం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ మునీంద్ర‌బాబు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.