GOW MAHOTSAVAM ON JANUARY 16 IN SV GOSHALA _ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో జనవరి 16వ తేదీన ‘గో మహోత్సవం’

Tirupati, 9 Jan. 20: TTD plans to conduct Gow Mahotsavam at the Sri Venkateswara Gow Samrakshana Shala, as per annual practice, on the Kanuma festival, which occurs on a day after Sankranthi festival.

The cow has a distinct place in Indian culture and is worshipped as Gomata by large Indian population. On a day after Sankranthi Gow is decorated colourfully with flowers and turmeric paste with belief that it brings good harvest.

Gow puja celebrations will commence on January 16 at 6am with Venu ganam and Veda Parayanam followed by the bhajana and sankeertans by artists of Dasa Sahitya Project and Annamacharya Project of TTD

Later on festivities including Gow puja, Gaja puja and Aswa puja, Tulasi puja and Basavanna dance will entertain the scores of local who take part in this fete with their children.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో జనవరి 16వ తేదీన ‘గో మహోత్సవం’

తిరుపతి, 2020 జనవరి 09: తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంత‌రం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.

కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8.00 గంటల నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటాలు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో సంకీర్త‌న  కార్య‌క్ర‌మాలు  నిర్వహిస్తారు. ఉద‌యం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు.  అనంత‌రం టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి హ‌రిదాసులు, డు..డు..బ‌స‌వ‌న్న నృత్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఉద‌యం 11.45 గంటల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని  టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.